Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వలిగొండ
మేజర్ గ్రామ పంచాయతీలో అపరిష్కతంగా సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ బోలా లలిత అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో సర్పంచ్‌ను మహిళలు నిలదీశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభ నిర్వహించి తిరిగి డిసెంబర్ మొదటి వారంలో రెండు నెలలకు గ్రామసభ నిర్వహించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ నెలలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 6- 13వ తేదీ వరకు స్వచ్ఛభారత్ నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. 13న స్వచ్ఛభారత్ వారోత్సవాల సభను నిర్వహించి, ఉపాధి హామీ గ్రామసభ అని నిర్వహించకుండానే మహిళా గ్రామ సభని పత్రికా ప్రకటన జారీ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1వ,3వ వార్డుల్లో నీటిి సమస్య తీవ్రంగా ఉందని, 10వ వార్డులో డ్రైనేజీలు, సీసీ రోడ్ల సమస్య పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. స్థానిక వెంచర్ల లో గ్రామపంచాయతీ జా గలను కాపాడాలని కోరారు .కోతులు, కుక్కలు, పందులు సమస్య నుండి విముక్తి చేయాలని కోరారు, చివరకు ఉపాధి హామీ గ్రామ సభ సంక్రాంతి పండుగ తర్వాత నిర్వహిస్తామని ఏపీఓ గ్రామ సభలో ఒప్పుకున్నారు. ఎంపీఓ పని సక్రమంగా లేదని శాశ్వత పంచాయతీ కార్యదర్శి నియమించాలని ప్రజలు కోరారు.