Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన 100 మంది వద్ధులకు మంగళవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు మండలంలో నిరుపేద కుటుంబాలకు చెందిన వద్ధులకు, వికలాంగులకు పదేండ్ల నుండి దుప్పట్లు పంపిణీచేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి , గ్రామ సర్పంచ్ కట్ట సమరసింహా రెడ్డి , సీనియర్ నాయకులు వనజ ,మురళి, మల్లేష్ ,తిరుపతి రెడ్డి ,భాస్కర్, గోవిందం, శివయ్య ,నర్సిరెడ్డి ,క్రాంతి ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.