Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
ఫిబ్రవరి 5,6,7 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎండి.ఇమ్రాన్ కోరారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలో ఆ సంఘం డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1920లో ఆవిర్భవించిన మొట్టమొదటి జాతీయ కార్మిక సంఘం ఏఐటీయూసీ అన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మికుల సమస్యలపై నిరంతరం ఎఐటీయుసీ పోరాటం నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండలకార్యదర్శి పల్లె శేఖర్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శంకర్, పాపగల్ల శంకరయ్య, ఆరుట్ల నరేశ్, ఎస్ఎ.రెహమాన్, శంకర్, సంజీవ, శ్రీకాంత్, మహేశ్ పాల్గొన్నారు.