Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు
కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఫిబ్రవరి 23,24 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఎస్.లింగోటంలోని ప్రతిష్ట పరిశ్రమ యూనియన్ ఆఫీస్ బేరర్స్ సమావేశం యూనియన్ అధ్యక్షులు ఎండి.పాషా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్మికులకు నష్టం చేసే విధానాలు అవలంభిస్తోందన్నారు. ఇప్పటి వరకు కార్మికులకు అనుకూలంగా ఉన్న 44 కార్మిక చట్టాలను మోడీి ప్రభుత్వం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని సమయాన్ని 12 గంటలు చేసేలా మోడీ యాజమాన్యాలకు అనుకూలంగా మార్పులు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలలో సంవత్సరాల తరబడి పనిచేసే వారిని పర్మినెంట్ చేసి హక్కులు కల్పించాల్సిన స్థానంలో ఫిక్స్ డ్ టర్మ్ ఎంప్లారుమెంట్ సిస్టమ్ తీసుకువచ్చి పని ముగియగానే కార్మికులను తొలగించే అవకాశం యాజమాన్యాలకు ఇచ్చిందని తెలిపారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని నిర్వహించే రెండు రోజుల సమ్మెలో సంఘటిత, అసంఘటిత, స్కీమ్ వర్కర్లు, పరిశ్రమల కార్మికులు, అన్ని వర్గాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ ప్రధానకార్యదర్శి గడ్డం వెంకటేశం, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిమూలం నందీశ్వర్, యాదగిరి, బిక్షపతి, వెంకటేశం, శ్రీను పాల్గొన్నారు.