Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో నియోజకవర్గానికి ఒక మినీ స్టేడియం నిర్మిస్తామని ఇచ్చిన హామీ నీటిమూటలా మిగిలిందని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ విమర్శించారు. మంగళవారం మండలంలోని చిమిర్యాల గ్రామంలో డీివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండవ మేనిఫెస్టోలో నియోజకవర్గానికి ఒక మినీ స్టేడియం కట్టిస్తామని, ప్రతి జిల్లా కేంద్రానికి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టు కోకుండా యువతను మోసం చేసిందన్నారు. గ్రామీణ స్థాయిలో అనేక ఆటలలో నైపుణ్యం కలిగిన యువత క్రీడలపై ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రభుత్వ తోడ్పాటు తోడైతే మరింత నైపుణ్యంతో ఉన్నత శిఖరాలకు వెళతారన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో క్రీడలపట్ల కపట ప్రేమ చూపిస్తోందన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మినీ స్టేడియం ,ఆట స్థలాలు ప్రత్యేక శిక్షకులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్,జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలపల్లి బాలకష్ణ,గుజ్జ సింగిల్ విండో చైర్మన్ దొడ యాదిరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, దొంతగొని పెద్దులు, శ్రీనివాస్ చారి, ఉప సర్పచ్ సుర్వి రాజు, సుర్వి కిరణ్, సుర్కంటి మహేందర్, ఆరుట్ల రాజు, కేసాని రమేష్, సుర్వి మహేందర్, దామ నరేష్, పాల్గొన్నారు.
బియ్యం పంపిణీ
రాజాపేట :మండల కేంద్రానికి చెందిన బిర్రు శాంతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె కుటుంబానికి స్వాతి చికెన్ సెంటర్ ప్రొప్రైటర్ కేదారి 50 కేజీల బియ్యం పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో బి .శ్రీనివాస్, బి. ప్రసాద్, కే. సంపత్ టి. రవి, కే. వెంకన్న ,సుదర్శన్ , రమేష్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.