Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిరూరల్
తమను మున్సిపల్ అధికారులు వేధిస్తు న్నారని, వారి వేధింపులను ఆపాలని కోరుతూ పట్టణంలోని తోపుడుబండ్ల వ్యాపారులు పట్టణంలో మంగళవారం రాస్తారోకో నిర్వహి ంచారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల నాయకులు కడెం లింగయ్య మాట్లాడారు. మున్సిపల్కేంద్రంలోని తోపుడుబండ్ల వ్యాపా రులను అధికారులు ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు.వారి బండ్లను తొలగిస్తుండడం సరికాదన్నారు.అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఆర్అండ్బీ రోడ్డుపై అక్రమనిర్మాణాలను తొలగించాలని, జ్యూస్షాపులు, మిర్చిబండ్లు వారి నుండి నెలకు రూ.6 వేల నుండి రూ.8 వేల వరకు వసూలు చేస్తుండడం సరికాదన్నారు. మున్సిపాలిటీ అధికారులకు తోపుడుబండ్లపై ఏమాత్రం మమకారం ఉన్నా వారికి లోన్లు ఇప్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్ర గణేష్, నిర్మల, యాకయ్య, మెట్టుపల్లి లక్ష్మీ, నగేష్, వనం సోమయ్య, బాలకృష్ణ, ప్రకాష్ పాల్గొన్నారు.