Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రీసైక్లింగ్ కోసం సూర్యాపేటకి తీసుకొచ్చిన వ్యాపారులు
నవతెలంగాణ-సూర్యాపేట
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి సూర్యాపేటకి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.టీఎస్ 03 యుబి 4225 నంబర్ గల డీసీఎంలో మూడు రోజుల కింద సత్తుపల్లి నుండి సూర్యాపేట జిల్లాకేంద్రానికి తరలిస్తుండగా పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ కోసం జిల్లాకేంద్రంలో రీసైక్లింగ్‌లో పేరొందిన ఓ రైస్‌మిల్లుకు తరలించేందుకు వ్యాపారులు సూర్యాపేటకు తీసుకొచ్చినట్టుగా విమర్శలు వినవస్తున్నాయి.సుమారు 15 క్వింటాళ్ల బియ్యంతో ఉన్న డీసీఎంను అదుపులోకి తీసుకున్న పట్టణ పోలీసులు లోతుగా విచారణ చేసి రేషన్ బియ్యంతో వ్యాపారం చేసే అక్రమార్కుల భరతం పట్టే పనిలో నిమగమైనట్టు విశ్వసనీయ సమా చారం.ఇదిలా ఉండగా అక్రమ వ్యాపారులపై కేసు నమోదు కాకుండా కొందరు నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.