Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్
నవతెలంగాణ-నల్లగొండ
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక నవతెలంగాణ ఒక్కటేనని అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు. నవ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2022 నూతన క్యాలెండర్, డైరీ, కోర్టు, బిజినెస్ క్యాలెండర్లను మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల సమస్యలపై ఎల్లప్పుడూ నిజాలను నిర్భయంగా రాసే నవతెలంగాణ దినపత్రిక ప్రజలలో మంచి ఆదరణ పొందిందన్నారు.ప్రజా సమస్యలను వెలికితీస్తూ సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషిస్తున్న నవతెలంగాణ ప్రజల పత్రికని కొనియాడారు. నవతెలంగాణ పత్రిక ప్రజల మన్ననలు పొందుతూ మరింత అభివద్ధి చెందాలని ఆకాంక్షించారు. పత్రికా యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలియచేశారు. కార్యక్రమంలో నవతెలంగాణ ఉమ్మడి జిల్లా మేనేజర్ పుప్పాల మట్టయ్య, నల్లగొండ రీజినల్ కమిటీ సభ్యులు వీరబోయిన పంచలింగం, నల్లబోతు గిరి, ఉమ్మడి జిల్లా ప్రతినిధి గాదె రమేష్, సబ్ ఎడిటర్లు వరుణమ్మ, కోమటిరెడ్డి రవీందర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, నల్లగొండ రిపోర్టర్ జాజాల కృష్ణ పాల్గొన్నారు.