Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా సూపరింటెండెంట్ చంద్రమోహన్
నవతెలంగాణ-మిర్యాలగూడ
అందరి భాగస్వామ్యంతో అద్భుత ప్రగతిని సాధించవచ్చని విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ చంద్రమోహన్ అన్నారు. విద్యుత్ శాఖను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఆ సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి, నల్లగొండ జిల్లా అధ్యక్షులు మారం శ్రీనివాస్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో చంద్రమోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గత రెండేండ్లలో కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితులతో విద్యుత్ సంస్థ రూ.4,300 కోట్ల నష్టాల్లో కూరుకు పోయిందన్నారు. ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందుతున్నదో లేదో తెలుసుకోవాలంటే దాని బ్యాలన్స్ షీట్ చూస్తే సరిపోతుందన్నారు. ప్రతి ఉద్యోగి రెవెన్యూ కలెక్షన్, బిల్లింగ్ విషయంలో శ్రద్ధగా డ్యూటీ చేయాలని సూచించారు. ట్యాంపరింగ్, కరెంటు తీగల మీద డైరెక్ట్ గా కొండ్లు వేయకుండా వారికి డీడీలు కట్టించి మీటర్లు వెంటనే ఫిట్టింగ్ చేయించాలని కోరారు. రైతులకు, వినియోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఉద్యోగులు చిత్తశుద్ధి, క్రమశిక్షణతో పని చేయాలని కోరారు. విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకు రాలన్నారు. అనంతరం మారం శ్రీనివాస్ మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులంతా రైతులకు, వినియోగదారులకు అందుబాటులో ఉండి ఫోన్ కాల్స్ పై తక్షణమే స్పందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గిరి, ఏఏఓ రామారావు, పీఓ సాంబశివ, ఏడీఈలు నరేందర్, సత్యనారాయణ, ఏఈఈలు వెంకటేశం, రాజ శేఖర్, శివరామకృష్ణ, సురేష్, గంజి వెంకటేశం, విశ్వం, నల్లగొండ డివిజన్ కార్యదర్శి రామ్మూర్తి, రమేష్, ఈశ్వర్, త్రినాథ్, సత్య నారాయణ, రామ్మూర్తి, శ్రీదేవి, సూర్య ప్రకాష్, కోటి, కొండబాబు, అధికారులు, ఉద్యోగులు, ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు.