Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
హమాలీ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పట్టణకేంద్రంలో కొబ్బరికాయల హమాలీ యూనియన్ సమావేశం కంబాలపల్లి స్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వాలు కనీస ప్రయత్నం చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. కార్మికచట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చిందన్నారు. కార్మికులు నూతనంగా యూనియన్ను ఏర్పాటు చేసుకోవలన్న అది అధికారుల ఇష్ట ఇష్టాలకు వదిలేసి, యజమానులు చేతిలో లేబర్ ఆఫీస్ని బంధీచేసిందన్నారు.కేంద్రం అవలంబిస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 23,24 న జరిగే దేశవ్యాపిత సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కొబ్బరికాయల హమాలి యూనియన్ అధ్యక్షులు కంబాల స్వామి ,ప్రధాన కార్యదర్శి వెంకటేశం,కోశాధికారి బండ శ్రీశైలం, నాయకులు వెంకటేష్ ,సిద్ధులు,రమేష్,అనిల్,మల్లేష్,బలరాజ్ ,కష్ణ,మధు ,నర్సింహ, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.