Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్
నవతెలంగాణ-సూర్యాపేట
స్వామి వివేకానంద ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. బుధవారం జిల్లా యువజన,క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 159 వ జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు,మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణలతో కలిసి వివేకానందున విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్ప ఆశయాలు ఉన్న మహోన్నత వ్యక్తి అని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, యువజన సంఘం అధ్యక్షులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ కమిటీ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ వైస్‌చైర్మెన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, వివేకానంద ఉత్సవ కమిటీి అధ్యక్షులు అంగిరేకుల నాగార్జున,జిల్లా యువజన, క్రీడల అధికారి బి.వెంకట్‌రెడ్డి,మున్సిపల్ కమిషనర్ రామనుజులరెడ్డి,మున్సిపల్ మాజీ చైర్మెన్ జుట్టుకొండ సత్యనారాయణ,ప్రముఖ న్యాయవాది తల్లమల హస్సేన్, కౌన్సిలర్లు తాహెర్పాషా,అనంతుల యాదగిరి,సిరివేలు లక్ష్మీకాంతమ్మ,టీఆర్ఎస్ పట్టణఅధ్యక్షులు సవరాల సత్యనారాయణ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సల్మా మస్తాన్, పాల్గొన్నారు.