Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ధాన్యం డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాటూరి బాలరాజు గౌడ్ కోరారు. బుధశారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో సుదగాని సత్య రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ధాన్యం అమ్ముకొని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదన్నారు. రైతులు సాగు చేయడానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడి, అప్పులపాలై పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర సైతం ప్రభుత్వం అందజేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరి కొనుగోలు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధును కౌలుదారులకు వర్తించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్, మండల కార్యదర్శి దుప్పటి వెంకటేష్, నల్ల మాస తులసయ్య, జూకంటి పౌలు, బుగ్గ నవీన్ పాల్గొన్నారు.