Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ధాన్యం కొనడంలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం రైతుబంధు వారోత్సవాలను జరుపుకోవడం సిగ్గు చేటని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి విమర్శించారు. బుధవారం పట్టణంలోని ఆర్ అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను వరి సాగు చేయొద్దు అన్న ప్రభుత్వం, ే రైతు బంధు వారోత్సవాలు చేస్తుందని విమర్శించారు.317 జీఓ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం అమానుషమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో, అధికార అహంతో వనమా రాఘవ లాంటి వారు ఎందరో సామాన్య ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పుడు కూడా వనమా రాఘవకు టీిఆర్‌ఎస్ ప్రభుత్వం సహకరిస్తూ ఉండడం నీతిమాలిన చర్య అన్నారు. అనంతరం ఏఐసీసీి కార్యదర్శి ప్రియాంక గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోత్నాక్ ప్రమోద్, తంగళ్లపల్లి రవికుమార్, కైరంకోండ వెంకటేష్, బిసుకుంట్ల సత్యనారాయణ, ఆదినారాయణ, కష్ణ యాదవ్ , దర్గాయి హరిప్రసాద్,బబ్లూ, రాజయ్య, సలావుద్దీన్, బద్దం రవీందర్ రెడ్డి, బెండ శ్రీకాంత్, అబిద్ అలి, యాదగిరి, బురన్, జగన్ మోహన్, అరపక నర్సింహ, ఎండి మజాజర్, అంగడి నాగరాజు, రఫియుద్దిన్, యాదగిరి, మల్లారెడ్డి, రషీద్,బురాన్, కుర వెంకటేష్, ఏజస్, అమర్, అజహర్ పాల్గొన్నారు.