Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యూటీఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు
నవతెలంగాణ-నల్లగొండ
లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 317 కారణంగా జిల్లాల అలకేషన్లో జరిగిన పొరపాట్లను సవరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ యూటీఎఫ్, టీఎస్ యూటీఎస్, ఎస్టీ, ఎస్సీ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ జిల్లా అలకేషన్లో సీనియర్లకు బలవంతంగా మొదటి ఆప్షన్ బదులు రెండవ, మూడవ ఆప్షన్ జిల్లాలను కేటాయించి జూనియర్లకు మొదటి ఆప్షన్ జిల్లాను కేటాయించి నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించారి పేర్కొన్నారు. డీఈఓ కార్యాలయ ఉద్యోగులు తమ ఇష్టానుసారం ఆర్డర్లు పాస్ చేశారని అన్నారు. ఈ విషయాన్ని డీఈఓ, కలెక్టర్కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. మొదటి రోజు రిలే నిరాహార దీక్షలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్రెడ్డి, జి.నాగమణి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపల్లి భిక్షపతి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశం, జిల్లా కోశాధికారి నర్రా శేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు బి. అరుణ, ఇతర జిల్లా కార్యదర్శులు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు రాములు పాల్గొన్నారు. డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పాల్గొని దీక్షలకు మద్దతు తెలిపారు.