Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాషం
నవతెలంగాణ-నల్లగొండ
మహిళల్లో సంఘటిత శక్తిని పెంచడానికి వాడవాడలా ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాషం, జిల్లా కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ 41వ శాఖ ఆధ్వర్యంలో పద్మావతి కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించి మాట్లాడారు. మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం ముగ్గుల పోటీలు దోహదం పడతాయి. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలని, మహిళలపై జరుగుతున్న అగత్యాలకు వ్యతిరేకంగా నిలబడడం కోసం చైతన్యం కల్పించడానికి సీపీఐ(ఎం) కషి చేస్తుందని అన్నారు. సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎండీ.సలీం మాట్లాడుతూ పండుగ సందర్భంగా మహిళలంతా ఒకచోట కూడి ఆనందంగా రంగవల్లులు వేసి తమ ప్రతిభ కనబరచడం అభినందనీయం అన్నారు. ఈ ముగ్గుల పోటీలకు న్యాయనిర్ణేతలుగా చిన్నపాక మంజుల, బి.మంజుల వ్యవహరించారు. ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య, శాఖ కార్యదర్శి కార్లపూడి రాము, శాఖ సభ్యులు నరేందర్, డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి గుండాల నరేష్, యువరాజ్, యామిని, శైలజ, రాధిక, పావని, మమత, సంధ్య, సుధారాణి, నందిని, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.