Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటీ డీఎంహెచ్‌గా పనిచేస్తున్న ఓ అధికారి పేరు చెప్పుకుంటూ సూపర్ వైజర్‌గా చలామణి అవుతున్న ఉద్యోగి ఆ పీహెచ్‌సీలోని సిబ్బంది పై ఆజమాయిషీ చెలాయిస్తున్నట్టు సమాచారం. ఏ కార్యక్రమం వచ్చినా తన అనుయాయులను రక్షిస్తూ ఇతర సిబ్బందిపై కక్ష సాధింపుగా విధులు నిర్వర్తించేలా ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. పల్స్ పోలియో మొదలుకొని కరోనా స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాల వరకు కూడా పలుమార్లు ఇలాంటి ఘటనలు ఎన్నో సార్లు పునరావతమైనట్టు సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు ఇతర సిబ్బందిని కలుపుకుపోకుండా తనకు నచ్చిన, మెచ్చిన వారినే అందలం ఎక్కిస్తు న్నట్టు ఆరోపణలున్నాయి. సూపర్ వైజర్ కు అనుయాయులుగా ఉన్న వారి వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేందుకు డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆదేశాలు జారీచేశారని ఒకే రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వ్యాక్సినేషన్ పూర్తి చేసి ఆ ఏఎన్ఎంపై భారం పడకుండా చేసిన ఘనత ఆయన సొంతం. మరుసటి రోజు నుంచి ఎలాంటి స్పెషల్ డ్రైవ్‌లు లేవని, ఎవరి వ్యాక్సినేషన్ వారే వేసుకోవాలని ఇతర ఏఎన్ఎంలకు హుకుం జారీచేసి వారిపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నా పలుమార్లు ఉన్నతాధికారుల దష్టికి తీసుకువెళ్లినా మందలింపుతోనే సరిపెట్టుకు రావడంతో అతగాడి ఆగడాలు మరింత తీవ్రరూపం దాలుస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
విధులకు హాజరుకాకున్నా సంతకాలు
పానగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్ వైజర్‌గా చలామణి అవుతున్న ఆ ఉద్యోగి చాకచక్యం అంతా ఇంతా కాదు. మంత్రి, కలెక్టర్, డిప్యూటీడీఎంహెచ్ఓ లాంటి ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించే సమయంలో కూడా వారి అనుయాయులకు సెలవులు మంజూరు చేసిన ఘనత ఉంది. ఇకపోతే వారి అనుయాయులు విధులకు హాజరుకాకున్నా మరుసటి రోజు హాజరు పట్టికలో సంతకాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మిగతా సిబ్బంది సెలవు పెడితే ఉదయం పది గంటలకే ఐపీఎల్ పడుతున్నట్టు సమాచారం. ఇటీవల ఓ ఏఎన్ఎం పదిహేను రోజులు వరుసగా విధులకు హాజరుకాకున్నా హాజరుపట్టికలో సంతకాలు చేయడం విశేషం. టార్గెట్ల విషయంలో కూడా మిగతా సిబ్బంది చేసిన టార్గెట్లను అందరికీ సమానంగా పంచి వారి అనుయాయులను కాపాడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. సిన్సియర్‌గా పనిచేస్తున్న సీనియర్ ఏఎన్ఎంలను సైతం ఇబ్బందులకు గురిచేస్తూ ఓసారి డీఎంహెచ్ఒతో మందలించే విధంగా చేయడంతో ఆ సీనియర్ ఏఎన్ఎం రాజీనామా చేసే వరకు వెళ్లింది. ప్రస్తుతం ఆ సూపర్వైజర్ వేధింపులు భరించలేక మరికొంతమంది కూడా రాజీనామా యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ సూపర్వైజర్ చేసే ఆగడాలకు నిజాయితీగా పనిచేసే ఉద్యోగులు పలువురు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మంత్లీరిపోర్టులను కూడా సరిచేయలేని ఆ సూపర్వైజర్ ఇతర ఏఎన్ఎంలు వేసిన రిపోర్టులను తన అనుయాయులకు ఇచ్చి వాటి ప్రకారం చేయాలని దగ్గరుండి మరీ రిపోర్టులు వారితో వేయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
నా దృష్టికి రాలేదు... విచారణ చేయిస్తా
కొండల్రావు, జిల్లా వైద్యశాఖ అధికారినల్లగొండ
పానగల్ పిహెచ్సీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ ఉద్యోగిపై ఎలాంటి ఫిర్యాదులు తన దృష్టికి రాలేదు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తా.. ఇష్టారాజ్యంగా వ్యవహరం చేస్తున్న సిబ్బందిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.