Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్సీగుత్తా, ఎంపీ బడుగుల
నవతెలంగాణ-మిర్యాలగూడ
కాంగ్రెస్, బీజేపీల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని శాసనమండలి మాజీ చైర్మెన్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ కోరారు. స్థానిక హనుమాన్ పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి రాజీవ్ చౌక్ వరకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోటి రెడ్డి తో కలిసి ఈ ప్రదర్శనను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్‌కు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ పనిగట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. జరగబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందుతుందని అన్నారు. కేసీఆర్ దిక్సూచిగా మారారని అన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అనారోగ్యంగా ఉండటంతో ఆయన తనయుడు నల్లమోతు సిద్ధార్థ నేతత్వంలో కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్, ఏఎంసీ మాజీ చైర్మెన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు రాంచందర్ నాయక్, టీఆర్ఎస్ జిల్లా మైనారిటీ నాయకులు షేక్ మధార్ బాబా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సైదులు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మెన్ కుర్ర కోటేశ్వరరావు, ఎంపీపీ నూకల హనుమంత్‌రెడ్డి, ఏడీఏ నాగమణి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, ఎంపీపీలు జెడ్పీటీసీలు, పీఏసీఎస్ చైర్మెన్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.