Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
ఇటీవల అనారోగ్యంతో మరణించిన మండలపరిధిలోని చెర్వుగట్టు గ్రామానికి చెందిన గాదె లతీఫ్ కుటుంబ సభ్యులను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం పరామర్శించి, రూ. 5వేల ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన గుంటి నర్సింహ తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు బత్తుల అంజిరెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నార్కట్ పల్లి మాజీ సర్పంచ్ పుల్లెంల అచ్చాలు, తొండ్లయి సర్పంచ్ బింగి కొండయ్య, నాయకులు గాయం శ్యామ్ సుందర్ రెడ్డి, గడ్డం పశుపతి, సిద్దగోని స్వామి, రేగట్టె రాజశేఖరరెడ్డి, నాంపల్లి శ్రీను, ముంత వెంకన్న, కొరివి శివరాం, నడిగోటి శేఖర్, సిసింద్రి పాల్గొన్నారు.