Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ మండల పరిధిలోని 12వ బెటాలియన్లో బుధ వారం డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బెటా లియన్ కమాండెంట్ ఎన్వీ సాంబయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతను వివరిం చారు. సిబ్బంది వ్యాక్సినేషన్ తప్పక తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మెడికల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎం హెచ్ఓ అనిమల్ల కొండలరావు, అదనపు కమాండెంట్ రామకృష్ణ, సహాయ కమాండెంట్ ఎం. వీరయ్య, ఎన్.వెంకన్న, ఏ.తిరుపతి, అశోక్ కుమార్, యూనిట్ డాక్టర్ నాగలక్ష్మి, నెహ్రూ, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.