Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
మండల కేంద్ర గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ బుధవారం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. వారితో పాటుగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి పాల్గొని మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ నిరంతరం సేవలు చేస్తున్నందున వారికి డ్రెస్సులు, గ్లౌజులు, నూనె, సబ్బులు, చెప్పులు, శానిటేజర్, మాస్కులు, బెల్లం ఇవ్వాలని గ్రామ సర్పంచ్, సెక్రెటరీ పాలక వర్గ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు గాదెపాక మరియమ్మ, పార్వతమ్మ, వీరమ్మ, లక్ష్మమ్మ, రాములమ్మ, భిక్షమయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.