Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా ఒక సైనికుల్లా పనిచేయాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని ధనలక్ష్మీ ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ చేపట్టిన నియోజకవర్గ స్థాయి డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.రానున్న రోజుల్లో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్తా పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రైతుకు రుణమాఫీ, గిట్టుబాటు ధరను అందజేసి రైతులను ఏ ఇబ్బంది పెట్టకుండా చూసిన ఘనత పార్టీదేనన్నారు.రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా రైతులను ఆదుకునే బాధ్యత తీసుకుంటామన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్, టీపీసీసీ సభ్యులు గుడిపాటి నర్సయ్య, మహిళా కమిటీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్‌రావు, భువనగిరి పార్లమెంట్ కోఆర్డినేటర్ బాలలక్ష్మీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేందర్‌రెడ్డి, రాజయ్య, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు అంబేద్కర్, తుంగతుర్తి మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, బూత్ ఎన్‌రోలర్స్,కార్యకర్తలు, పాల్గొన్నారు.