Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
మండలకేంద్రంలో నవతెలంగాణ-2022 నూతన సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో పలువురు ప్రజాప్రతి నిధులు, అధికారులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రజాసమస్యలను వెలికితీసి ప్రజలకు న్యాయం జరిగే వరకు నవతెలంగాణ దినపత్రిక నిరంతరం పని చేయడం అభినందనీ యమన్నారు.నిజాన్ని నిర్భయంగా రాయడంలో నవతెలంగాణ ముందుం టుందన్నారు.పత్రికలు ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకపాత్ర పోషిసు ్తన్నాయని పేర్కొన్నారు ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా పత్రికలు వ్యవహరిస్తు న్నాయన్నారు.నవతెలంగాణ పత్రిక ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి, సమస్యల పరిష్కారానికి కషి చేసి ప్రజల మన్ననలు పొందడంలో ముందువరుసలో ఉందన్నారు. కార్మిక, కర్షక, శ్రామిక, రైతుల ,పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నవతెలంగాణ పత్రిక నిరంతరం కషి చేయాలని ఆకాంక్షిం చారు.అనంతరం కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మెన్ కడియం వెంకట్‌రెడ్డి, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, సీపీఐ(ఎం) మండలకార్యదర్శి ఎస్కె. యాకుబ్, ఎస్సై కొండల్‌రెడ్డి, తహసీల్దార్ కార్తీక్, ఎంపీడీఓ వనజ, ఎంపీఓ లావణ్య, సీనియర్ నాయకులు రాచమల్ల రామస్వామి దోసపాటి భిక్షం, పోకల వెంకటేశ్వర్లు, యడవెల్లి చంద్రారెడ్డి, రిపోర్టర్ యల్లావులవెంకటేష్యాదవ్ పాల్గొన్నారు.