Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం సెరినిటీ పాఠశాలలో సంక్రాంతి సంబురాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. హరిదాసు, గంగిరెద్దుల వేషాలు, సోది జెప్పేవారి వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. అందమైన ముగ్గులతో పాఠశాల ప్రాంగణం పండుగ కళను తెచ్చింది. ఈ వేడుకల్లో పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపాల్ నోముల జంగిరెడ్డి, ముఖ్యకార్యదర్శి నోముల వసంత, ఏఓ సుబ్బారావు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.