Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
ప్రజా సమస్యలపై నిబద్ధతతో, నిస్వార్థంగా ఉద్యమించే సీపీఐ(ఎం) ఆదరించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్వివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య అన్నారు.ఆ పార్టీ రాష్ట్ర మూడవ మహాసభల జయప్రదం కోసం మంగళవారం మండల కేంద్రంలో ఇంటింటికీ సీపీఐ(ఎం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) నిరంతరం పోరడుతోందన్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు నిత్యం ధరలు పెంచుతూ పేదలపై పెనుభారాలు మోపుతూ వారి జీవితాలను దుర్భరం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి రైతులు, వ్యవసాయ కూలీలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత భవితవ్యం ప్రశ్నార్థగా మారుతుందన్నారు. మండల కేంద్రంలో ఉన్న ప్రదాన సమస్యలైన ప్రభుత్వాస్పత్రి, అంతర్గత రోడ్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. పట్టణ అభివద్ధికి రూ.50 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, పట్టణ కార్యదర్శి గాదె నరేందర్, వనం ఉపెందర్, కందుల హనుమంతు, బోయిని ఆనంద్, నాగటి ఉపేందర్, బావండ్లపల్లి బాలరాజు, బల్గూరి అంజయ్య, కల్లూరి నగేష్, గన్నెబోయిన విజయభాస్కర్, ఎండి రషీద్, పులి భిక్షం, మేడి గణేష్, పిట్టల శ్రీనివాస్, గంటెపాక శివకుమార్, మునుకుంట్ల లెనిన్, గుండాల భిక్షం, మెట్టు శ్రవణ్, శానగొండ వెంకటేశ్వర్లు, భావండ్లపల్లి సత్యం, మేడి ముకుందం పాల్గొన్నారు.