Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిటౌన్
మహిళలకు ఓటు హక్కు ,ఆస్తి హక్కుతో పాటు వారి హక్కుల కోసం కషి చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను దేశ కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలంగాణ రాష్ట్ర పున: నిర్మాణసమితి వ్యవస్థాపక సభ్యురాలు మాటూరి యశోధర అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల (57వ వారం) సమర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. భారత రాజ్యంగ నిర్మాత, రిజర్వ్ బ్యాంక్ స్పూర్తి ప్రదాత అంబేధ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించే వరకు మహిళలంతా కలిసి కట్టుగా కషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జిల్లా చైర్మెన్ కొడారి వెంకటేష్, జిల్లా గౌరవాధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, సాధన సమితి జిల్లా నాయకులు కొత్త బాలరాజు, బండారు శివ శంకర్, రావుల రాజు, దర్గాయి దేవేందర్,గుడ్డెంకి లక్ష్మి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.