Authorization
Mon April 14, 2025 12:40:28 am
నవతెలంగాణ- భువనగిరిరూరల్
మండలంలోని గౌస్‌నగర్ గ్రామంలో సోమవారం సాయంత్రం ఎలుగుబంటి సంచరించినట్టు రైతులు పోలు శంకర్ యాదవ్, భూష బోయిన వీరయ్య యాదవ్ తెలిపారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌస్ నగర్ గ్రామంలో పర్రే బావి పక్కన రైతు పొలం దున్నుతున్న సందర్భంలో పొలం గట్టు మీదుగా ఎలుగు బంటి వెళ్లడాన్ని గమనించి బెదిరించాడు. అది ఎర్రంబెల్లి గ్రామం వైపు వెళింది. ఇటీవల కాలంలో బండసోమారం, చందుపట్ల, పెంచికలపాడు గ్రామాలలో సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు. రామచంద్రపురం గ్రామంలో లేగదూడలను ఇటీవల చంపిందని రైతులు పేర్కొంటున్నారు. అటవీశాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.