Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మున్సిపల్ కేంద్రంలో మంగళవారం స్థానిక రైల్వే అండర్పాస్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరుతూ బాధితులు మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగాటీడీపీ మండల కన్వీనర్ మల్రెడ్డి సాంబిరెడ్డి మాట్లాడుతూ అండర్పాస్ నిర్మాణ బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తునికి దశరథ, బందెల సుభాష్, ఎండి సలీం, పసునూరి వీరేశం, వడ్డేమాన్ వెంకటేష్, రాచకొండ జనార్ధన్, ఎండి.రఫీ, ఎండీ గౌస్, ఉపేందర్ సెట్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.