Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను కూల్చి మార్కెట్ ఏర్పాటు చేయొద్దని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ సర్వే నెంబర్ 552లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి గాను రూ.2 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ఈ మార్కెట్‌ను సర్వే నంబర్1లోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల ప్రభుత్వ కార్యాలయాలను కూల్చి మార్కెట్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూల్చకుండా ప్రజలకు అనువుగా ఉన్న చోట సమీకృత మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల, టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయికృష్ణ, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి గాజుల శ్రీనివాస్, ఇంటి పార్టీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు చెరుకు లక్ష్మి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పన్నాల రాఘవ రెడ్డి, గార్లపాటి రవీందర్‌రెడ్డి, టీడీపీ నాయకులు యాతాకుల అంజయ్య, సామాజిక కార్యకర్త వంటేపాక అంబెడ్కర్, బొమ్మకంటి కొమరయ్య, రాచకొండ వెంకన్న, వంటెపాక వెంకటేశ్వర్లు, సతీష్, నరేష్, పందిరి సతీష్ ఉన్నారు.