Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాండు
నవతెలంగాణ-అడ్డగూడూరు
ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసేది కమ్యూనిస్టులేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో ఇంటింటికి సీపీఐ(ఎం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా తుర్కఎంజాలలో నిర్వహించనున్న పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బుర్రుఅనిల్ కుమార్, మండల కమిటీ సభ్యులు కందుల ఐలమల్లు, చిత్తలూరి మల్లయ్య,గూడెపు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.