Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించకపోవడంతోనే చెడువ్యసనాల బారిన పడుతున్నారని డీివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుగ్గ నవీన్, గడ్డం వెంకటేష్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పటేల్ గూడెంలో ఆ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, ప్రభుత్వం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి విస్మరించాయన్నారు. స్థానిక పరిశ్రమల్లో యువతకు ఉపాధి అవకాశాలుకల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘంమండల అధ్యక్షులు భీమగాని సాయి కుమార్,సాయికిరణ్,కార్తీక్ ,భాను ప్రసాద్, ఉదరు, భరత్ పాల్గొన్నారు.