Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ -కేతేపల్లి
పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసి అమరులైన వారి త్యాగాలు చిరస్మరణీయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. కేతేపల్లి మండలంలోని బండిపాలెం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు జెర్రిపోతుల వెంకటయ్య భౌతిక కాయానికి ఆయన మంగళవారం పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో సందర్భంగా చనిపోవడం జరుగుతుందని, అలాంటి వారిలో కొద్దిమందిని మాత్రమే ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని, అలాంటి వ్యక్తి వెంకటయ్య అని అన్నారు. ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యల్లో పాలుపంచుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేసిన వ్యక్తి వెంకటయ్య అన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కంధాల ప్రమీల, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు, మండల కార్యదర్శి సీహెచ్. లూర్దూ మారయ్య, ఆదిమల్ల సుధీర్, చౌగోని నాగయ్య, కట్ట ప్రబాత్, వీరేష్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల పరామర్శ
మండలంలోని బండపాలెం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జెర్రిపోతుల వెంకటేష్‌గౌడ్ మృతి చెందగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కందాల ప్రమీల, జిల్లా కాంగ్రెస్ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి, రాచకొండ వెంకన్న, వంటేపాక వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు బొడ్డుపల్లి ఉపేందర్, వంగూరి రాములు, ఎండీ.యూసుఫ్, పందిరి సతీష్ పాల్గొన్నారు.