Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ డిమాండ్‌చేశారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆ పార్టీ మండల కార్యదర్శివర్గ సమావేశం బూర్గు కష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు రైతు ప్రయోజనాలను తాకట్టు పెట్టే యోచనలో భాగంగానే ఎరువుల ధరల పెంపు అన్నారు. ఇప్పటికే రైతాంగం పండించిన పంటలకు మద్ధతు ధర లేక వ్యవసాయం గిట్టుబాటు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎరువుల ధరలు పెంచడం మూలంగా అప్పులు బారిన పడే ప్రమాదముందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయన్నారు. రైతు వ్యతిరేక విధానాలు మానుకోకపోతే రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రొడ్డ అంజయ్య, మండలకార్యదర్శి గంగదేవి సైదులు, చీరిక సంజీవరెడ్డి, రాగీరు కిష్టయ్య, తడక మోహన్, బొజ్జ బాలయ్య పాల్గొన్నారు.
దివీస్ పరిశ్రమ ముందు ఫ్లైఓవర్ నిర్మించాలిః సీపీఐ(ఎం)
మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలోని దివీస్ పరిశ్రమ ముందు 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్‌చేస్తూ మంగళవారం సీపీఐ(ఎం) మున్సిపల్కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ మాట్లాడుతూ మాట్లాడారు. దివీస్ పరిశ్రమ ముందు 65వ నెంబర్ జాతీయ రహదారిపై నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు, ప్రజలు, కార్మికులు చనిపోతున్నారని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలు వీధిపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఫ్లై ఓవర్ నిర్మించి ప్రమాదాలు జరుగకుండా చూడాలని హైవే అథారిటీ, జీఎంఆర్, దివీస్ పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రొడ్డ అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా, మున్సిపల్ వైస్‌చైర్మెన్ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, నాయకులు దండ అరుణ్‌కుమార్, చీరిక సంజీవరెడ్డి, రాజు పాల్గొన్నారు.