Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ-గుర్రంపోడు
పార్టీలకు అతీతంగా మండలాభివృద్ధికి కృషి చేస్తానని నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు మంచికంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గుర్రంపోడు మండల అభివృద్ధి కోసం పార్లమెంటులో తన గళాన్ని వినిపిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆన్లైన్ విద్యను బలోపేతం చేయడం కోసం పార్లమెంటులో చర్చిస్తానని తెలిపారు. ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకునే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్, ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన విజయవంతంగా చేస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రకతి వనాలు, శ్మశాన వాటికలు, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ, తాగునీరు మొదలైన అన్ని సౌకర్యాలు ప్రజలకు అందజేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. సందర్భంగా ఎంపీటీసీలు సర్పంచులు తమ పరిధిలోని సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్, తహసీల్దార్ సంఘమిత్ర, పీఏసీఎస్ చైర్మన్ ఆవుల వెంకన్న యాదy,్ సర్పంచుల ఫోరం అధ్య క్షులు రావులపాటి భాస్కర్, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.