Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా పోలీసు నూతన కార్యాలయాన్ని పరిశీలించిన రాష్ట్ర పోలీసు గహనిర్మాణ సంస్థ పర్యవేక్షణ ఎస్పీ డా.చేతన
నవతెలంగాణ-సూర్యాపేట
త్వరితగతిన ప్రజలకు సేవలందాలనే సంకల్పంతో,వారి సౌకర్యార్థం ఆయా జిల్లాల్లో నూతన పోలీసు కార్యాలయాల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర పోలీసు గహ నిర్మాణ సంస్థ పర్యవేక్షణ ఎస్పీ డా.చేతన వెల్లడించారు.ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలో నిర్మితమౌతున్న జిల్లా పోలీసు నూతన కార్యాలయం భవన నిర్మాణపనులను ఆమె ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు.కార్యాలయ భౌగోళిక స్థితిగతులను, నిర్మాణ పనులను ఎస్పీని అడిగి తెలుసు కున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యాలయ నిర్మాణపనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.త్వరలో నూతన కార్యాల యాల ద్వారా ప్రజాసేవలను మరింత దగ్గరగా అందుబాటులోకి తేవాలని కాంట్రాక్ట్ సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించారు.అనంతరం పనులు వేగంగా జరుగుతున్నాయని,ఇంకా కొనసాగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని సంస్థ ఇంజనీర్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రితిరాజ్, పోలీసు గహ నిర్మాణసంస్థ ఈఈ అబ్దుల్ ఖుద్ధుస్,డీఈ సుందర్,ఏఈ బాలరాజు, పట్టణ సీఐ ఎ.ఆంజనేయులు,కాంట్రాక్ట్ సంస్థ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.