Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
నవతెలంగాణ-నల్లగొండ
జనాభా లెక్కల సేకరణ 2021లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ గ్రామం యూనిట్‌గా, అర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ వార్డు యూనిట్‌గా తీసుకోవాలని అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్ లు, మున్సిపల్ కమిషనర్లు, సహాయ గణాంక అధికారులకు జనాభా లెక్కలు 2021 సేకరణ గురించి వివరించారు. దేశంలో గొప్ప కార్యక్రమం జనాభా లెక్కల సేకరణ అన్నారు. ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి వివరాలు జనాభా లెక్కలలోకి తీసుకోవాలని ఎన్యుమరేటర్లు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. జనాభా లెక్కలు 2021కి సంబంధించిన గైడ్ లైన్స్‌ను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా సంబంధిత ప్రొఫార్మాలలో వివరాలు నమోదు చేయాల్సి ఉందన్నారు. అధికారులు ఎక్కడ పొరపాట్లు చేయరాదని ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తేవాలని సూచించారు. గతంలో చేసిన జనాభా లెక్కలకు సంబంధించిన ఛార్జ్ రిజిస్టర్లు బ్లాకుల వారీగా పరిశీలించి 2011 జనాభా లెక్కలకు అవసరమైన బ్లాక్‌లు, హద్దులు, రెవెన్యూ గ్రామాలు, మున్సిపల్ వార్డులను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు.కాన్కార్డ్ స్టేట్మెంట్లలో గ్రామీణ ప్రాంతాలకు ప్రొఫార్మా 1, అర్బన్ ప్రాంతాలకు ప్రొఫార్మా 2గా నిర్ధారించారని ఆయన తెలిపారు. ఈనెల 27వ తేదీ వరకు డ్రాఫ్టులను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. కాన్ఫరెన్స్‌లో చిట్యాల, నకరేకల్, నందికొండ, అనుముల, చండూరు తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లను సందేహాలను అడిగి తెలుసుకొని వారి ప్రశ్నలకు జాయింట్ కలెక్టర్ జవాబులు చెప్పారు. జనాభా లెక్కల నిర్వహణకు నల్లగొండ జిల్లా ఇన్చార్జ్ అధికారి పీవీ సుబ్రహ్మణ్యం వర్క్ షీట్లను ఎలా నింపాలో వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ కార్యాలయం సూపరి ంటెండెంట్ కృష్ణమూర్తి, ఎన్నికల డీటీ విజరు పాల్గొన్నారు.