Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
జడ్చర్ల-కోదాడ హైవేపై గరిడేపల్లి వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు కోరారు.మండల కేంద్రంలోని అరిబండిభవన్లో మంగళవారం అంబేద్కర్ విగ్రహ పోరాట సమితిఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మందా భిక్షం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వింజమూరి మల్లయ్య మాదిగ మాట్లాడారు. ప్రపంచమేధావిగా పిలువబడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 1994లో గరిడేపల్లిలో ఏర్పాటు చేశారని, ఈ మధ్యకాలంలో జడ్చర్ల టు కోదాడ హైవే రోడ్డు వెడల్పులో భాగంగా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారని ఆరోపించారు.ఈ విగ్రహాన్ని మరలా హైవేపైనే ఏర్పాటు చేయాలని శంకుస్థాపన చేసినప్పటికీ, గరిడేపల్లికి చెందిన స్వాతంత్య్రసమర యోధుడు బండ పుల్లారెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించి హైవేపై విగ్రహాలు పెట్టొద్దని స్టే తీసుకొచ్చారని ఆరోపి ంచారు.ప్రస్తుతం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడే ఉంచాలని సకల జనులు సైతం మద్దతు ఇచ్చారన్నారు.ఈ విషయంలో హైవేపై అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్షం, పాలకపక్షం తమతో కలిసి రావాలని కోరారు.సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొదమగుండ్ల నగేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ధనుంజయనాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక కులం, మతానికి సంబంధించిన వారు కాదని యావత్ భారతదేశం గర్వించదగ్గ మహా నాయకులన్నారు.ప్రపంచదేశాలు గౌరవి స్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన బండ పుల్లారెడ్డిని తీరును ఖండిస్తూ ప్రభుత్వం వెంటనే ఆయన పెన్షన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్వాయి రమేశ్, వింజమూరు వెంకటయ్య, కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు ఊట్కూరుసైదులు,ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఎడవల్లిచంద్రయ్య, పట్టణకార్యదర్శి వింజమూరి పున్నయ్య, మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు పిట్టబాబు, ఎస్సీ సంక్షేమసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి జిలకర రామస్వామి, పాతకోటి అర్జున్, వింజమూరి నగేష్, ఉబ్బెలి సైదులు తదితరులు పాల్గొన్నారు.