Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీఈఓ భిక్షపతి
నవతెలంగాణ-నల్లగొండ,నార్కట్‌పల్లి
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు బీసీటీయూ కృషి చేయాలని జిల్లా విద్యాధికారి భిక్షపతి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో బీసీ ఉపాధ్యాయ సం ఘం జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. బీసీటీయూ సామా జికంగా, సర్వీస్ విషయంలో చక్కగా పనిచేస్తుందన్నారు. బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు కొన్నె శంకర్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పాఠశాలలు తెరిచి బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు. 317 జీవో ను సవరించి నష్ట పోయిన వారికీ న్యాయం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీటీయూ ప్రధాన కార్యదర్శి నల్ల మేకల వెంకయ్య , జిల్లా బాధ్యులు ఉపేందర్, పుష్పమాల శ్రీనివాస్, జి.వెంకన్న, భాస్కర్, జి.శ్రీనివాస్, కష్ణ గౌడ్, సైదులు, కేశవులు, వెంకన్న, నరేందర్, శ్రీహరి, పాల్గొన్నారు.