Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రామన్నపేట
మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ చుట్టూ ఉన్న డబ్బాలను పోలీస్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అనుమతితో తొలగించనున్నామని అందరూ సహకరించాలని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి కోరారు. బుధవారం స్థానిక బస్టాండ్‌లో నిర్మించిన నూతన షాపింగ్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. అనంతరం నిర్వాహకుల వద్దకు వెళ్లి డబ్బాలు రెండు రోజుల్లో తొలగించాలని సూచించారు. బస్ స్టాండ్ ఆవరణ చుట్టూ 19 మడిగలను నిర్మించామని సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన వెంటనే టెండర్ దారులకు స్వాధీనం చేస్తామని తెలిపారు. బస్టాండ్ ఆవరణలో టెండర్ ద్వారా స్థలాన్ని పొందిన వారికి వారం రోజుల్లో డబ్బాలు ఏర్పాటుకు స్థలం కేటాయిస్తామని చెప్పారు. బస్టాండ్ ఆవరణలో హెచ్‌పిసిఎల్ పెట్రోల్ బంకు ఏర్పాటు కానుందని, అందుకోసం స్థలాన్ని కూడా కేటాయించామని వారికి వారం రోజుల్లో స్థలాన్ని కేటాయించనున్నామని తెలిపారు. యజమానులు స్వచ్ఛందంగా డబ్బాలను తొలగించాలని లేనిపక్షంలో జేసీబీతో తొలగిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట డిపో అసిస్టెంట్ మేనేజర్ సైదులు నాయక్, స్థానిక నాయకులు గోదా సు పథ్వి రాజ్, భావండ్లపల్లి సత్యనారాయణ, మల్లేశం, శ్రీకాంత్, వ్యాపారులు తదితరులు ఉన్నారు.