Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణకేంద్రంలోని విద్యానగర్ కాలనీకి చెందిన ఆ పార్టీ సభ్యత్వం పొందిన దొంత పాండు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ కింద వచ్చిన రెండు లక్షల రూపాయల చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. అదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను అంతటి బాలరాజుగౌడ్, బొమ్మకంటి మంగమ్మలకు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ చైర్మెన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం చైర్మెన్ దేవరపల్లి గోవర్థన్‌రెడ్డి, కౌన్సిలర్లు కోరగోని లింగస్వామి, ఎండి.బాబా షరీఫ్, సుల్తాన్ రాజు, తాడూరి శిరీష, అంతటి విజయలక్ష్మీ, బొడిగె అరుణ, బత్తుల రాజ్యలక్ష్మీ పాల్గొన్నారు.