Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-తుర్కపల్లి
మండల కేంద్రంలో ఇండిస్టియల్ పార్క్ పేరుతో 72 సర్వే నెంబర్ లోని 108 ఎకరాల రైతుల భూములు ప్రభుత్వం తీసుకోవడం సరికాదని, దీన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రైతుల భూములను ఆయన పరిశీలించి మాట్లాడారు. 70 ఏండ్ల పైగా 65 కుటుంబాలకు చెందిన రైతులు భూములు సాగుచేసుకుంటున్నారన్నారు. ఈ భూములపై ఆధారపడి అనేక మంది బతుకుతున్నారన్నారు. పరిశ్రమల పేరుతో భూములను తీసుకుంటుందన్నారు. వందల ఏకరాలు ఉన్నవారి భూముల్లో ఇండిస్టియల్ పార్క్‌లు పెట్టాలని డిమాండ్ చేశారు. పేదల జోలికి వస్తే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్, మండల సీనియర్ యకులు కొక్కొండ లింగయ్య, నిర్వాసితులు కసరబోయిన గోపాల్, బింగి కోమరయ్య,బోయిన బాలయ్య,యెల్లోజు వెంకటేశ్వర్లు,శేకర్,సాయిలు,బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.