Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు
నవతెలంగాణ- ఆలేరు
ఈ నెల 22 నుండి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కఎంజాలలో జరిగే సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభ లను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు కోరారు. బుధవారం పట్టణకేంద్రంలో ఇంటింటికి సీపీఐ(ఎం) కార్యక్రమం నిర్వహించి కరపత్రాలు పంపిణీచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఎలాంటి పనులు జరగడం లేదని, ఏ సర్టిఫికెట్ కోసం వెళ్ళిన ఆన్లైన్ పనిచేయడం లేదని చెబుతున్నారని ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ.ఇక్బాల,్ మండల కార్యదర్శి వెంకటేష్ వడ్డెమాను శ్రీనివాసులు , సీఐటీయూ మండల నాయకులు మోరిగాడి రమేష్, సూదగాని సత్య రాజయ్య ,గణగాని మల్లేష్ బుగ్గ నవీన్, సంగి రాజు, భువనగిరి గణేష్, పరుష నాగరాజు, కాసుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.