Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య
నవతెలంగాణ-దేవరకొండ
సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య పిలుపు నిచ్చారు. మంగళవారం దేవరకొండలో జరిగిన మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈనెల 22న సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 23 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో నిర్వహించనున్న రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తులో చేపట్టబోయే పోరాటాలు, ఉద్యమాలు రూపొందించనట్లు తెలిపారు. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని, ముఖ్యంగా మిర్చి పంటకు తామర వైరస్ బూడిద తెగులు సోకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. ఎకరానికి రూ.70 వేల చొప్పున పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పంట వివరాలను సేకరించాలని సూచించారు. కౌలు రైతులకు పంట బీమా, రైతు బీమా, రైతు బంధు పథకం పథకాలు అమలు చేయకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బీడు భూములకు రైతుబంధు ఇస్తున్న ప్రభుత్వం కౌలు రైతుల విషయంపై సానుకూలంగా స్పందించారని కోరారు. కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా గ్రామాలు, వార్డుల వారీగా మొబైల్ టీం ఏర్పాటు చేసి మెరుగైన వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించి ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించాలని సూచించారు. సమావేశంలో మండల కార్యదర్శి నల్ల వెంకటయ్య మండల కమిటీ సభ్యులు బిజిలీ లింగయ్య, ఎం.పర్వతరెడ్డి, నిమ్మల పద్మ, చిన్న వెంకటయ్య, బుడిగ వెంకటేష్, కొండ లలిత పాల్గొన్నారు.