Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులు వేగవంతం చేయాలని, అన్ని జీపీలలో జాబ్ కార్డ్ కలిగిన కూలీలకు పనులు కల్పించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంపీడీఓలు, ఏపీఓలు, పంచాయతీరాజ్ డీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి హామీ పనులు, వైకుంఠధామంల నిర్మాణం ప్రగతి పనులు మండలాల వారీగా సమీక్షించారు. ప్రతి జీపీలో ఒక ఫామ్ పాండ్ కానీ, ఫిష్ పాండ్ కానీ ఉపాధి హామీ కింద చేపట్టాలని ఆదేశించారు. చాలా మండలాల్లో ఉపాధి హామీ కింద కూలీలకు పనులు కల్పించడంలో ఆశించిన మేర ప్రగతి లేదని, ప్రతి జీపీలో పనులు వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు కల్పించాలని అన్నారు. లేబర్ బడ్జెట్ పూర్తిగా ఖర్చు చేయాలని సూచించారు. వైకుంఠధామంల నిర్మాణ పనులు సమీక్షిస్తూ మిగిలిన ఉన్న పెండింగ్ పనులు జనవరిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీఓలు మిగిలిన వైకుంఠధామంల నిర్మాణాన్ని పూర్తి చేయించాలని ఆదేశించారు. ఉపాధిహామీ పనులు పరిశీలించేందుకు నేషనల్ మానిటరింగ్ టీమ్ జిల్లాలో పర్యటించనున్నందున సంబంధించిన రిజిస్టర్లు, రికార్డ్లు అప్డేట్ చేసి సిద్ధంగా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ్ చౌహన్, జెడ్పీసీఈఓ వీరబ్రహ్మచారి, డీఆర్డీఓ కాళిందిని, పీఆర్ఈఈ తిరుపతయ్య పాల్గొన్నారు.