Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఉపాధ్యాయుల నియామకాలు లేవు కానీ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అట అని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఎద్దేవాచేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతోందని కేంద్రంలో మోడీ రాష్ట్రంలో టీిఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కై రైతుల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని రాబోయే తెలంగాణ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ సంచార జాతుల నాయకుడు బెల్లా నాయక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపల్లి మల్లారెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మార్తా కష్ణమూర్తి వల్లపు రమేష్ కరోన బోయిన లింగయ్య పాల్గొన్నారు.