Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ శాసనసభ సభ్యుడు గాదరి కిశోర్ కుమార్
నవతెలంగాణ -నూతనకల్
గ్రామాల సమగ్రాభివద్ధే ప్రభుత్వం ధ్యేయమని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని మిర్యాల ,లింగంపల్లి మాచనపెళ్లి దిర్శనపెళ్లి తాళ్ల సింగారం సోమ్లా గ్రామాల్లో నిర్మించిన , నిర్మించనున్న సీసీ రోడ్డులు నిర్మాణం రైతు వేదికలు పల్లె ప్రకతి వనం వంటి పలు అభివద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న రెండు సంవత్సరాలలో గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సమగ్ర అభివద్ధి కోసం కషి చేస్తామన్నారు. మిరియాలలో యాదవ సంఘానికి భేరిల కోసం రూ.25 వేల విరాళం అందజేశారు. మండల కేంద్రంలోని అనారోగ్య బారిన పడిన జటంగి వెంకన్న పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. సీనియర్ నాయకుడు పగ్గిల్ల వెంకట్ రెడ్డి తండ్రి మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూ రెడ్డి కళావతి సంజీవరెడ్డి రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ ఎస్.ఎ రజాక్ ,పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న ,వైస్ ఎంపీపీ జక్కి పరమేష్ ,వివిధ గ్రామాల సర్పంచులు తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి కనుక సునీత వెంకన్న , గొరుగంటి ఉషా రామ్, కిషన్ రావు, భదావత్, సావిత్రి, చక్రధర్ కుందేన అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.