Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సూర్యాపేట
కార్మికులు,కర్షకులు బలమైన సమైక్య పోరాటాలు జరిపి పాలకుల విధానాలను తిప్పికొట్టాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు పిలుపు నిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో నిర్వహించిన కార్మిక,కర్షక సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వలన నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల, నిరుద్యోగం తదితర సమస్యలతో కార్మికులు, పేదరైతులు, గ్రామాల్లోఉన్న వత్తిదార్లు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని విమర్శించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్రకమిటీసభ్యురాలు కొప్పుల రజిత, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మామిడి సుందరయ్య, యాతాకుల వెంకన్న,శంకర్ తదితరులు పాల్గొన్నారు.