Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వ్యకాస జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ- కోదాడరూరల్
కార్మిక కర్తగా ఐక్యతతో సమస్యల ఉద్యమాలు నిర్వహిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని సుందరయ్య భవన్లో కార్మిక కర్షక దినోత్సవ రౌండ్ టేబుల్ సమావేశం రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1982లో తమిళనాడు రాష్ట్రంలో జరిగిన కార్మికుల పోరాటం ఒక చారిత్రాత్మకమైనదని ఆ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో వ్యవసాయ కార్మికులు రైతులు కార్మిక వర్గం ఐక్యంగా సాగిస్తున్న పోరాటం పైన పోలీసు మూకలు కాల్పులు జరపడంతో 12 మంది తమ ప్రాణాలను బలి దానం చేయడం జరిగింది అని, మరో 32 మందికి తీవ్రమైన గాయాలు అయినాయి ఆ పోరాటం లో అనేక విజయాలు సాధించింది ఆ పోరాట దినాన్ని దేశవ్యాప్తంగా జనవరి 19న కార్మిక కర్షక ఐక్యత దినోత్సవంగా జరపాలని పిలుపునిచ్చారు. ఆ పోరాట స్ఫూర్తితో కార్మికులందరూ ఐక్యంగా ముందుకు సాగాలని తద్వారా సమస్యలు పరిష్కరించ పడ్డాయన్నారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన నాటినుండి కార్మిక కర్షక ఉద్యమాలు బలోపేతమయ్యాయి అని వారన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు దేవరం వెంకట్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వెల్ది పద్మావతి, ఎస్.జానయ్య, సీటీయూ జిల్లా నాయకులు ఎం.రాంబాబు, ఎం.ముత్యాలు, పి కాటయ్య, స్వరాజ్యం, జుట్టుకొండ బసవయ్య , కుక్కడపు నళిని, వై వీరాంజనేయులు, నందిగామ సైదులు, తదితరులు పాల్గొన్నారు.