Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
పిల్లలలో పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని, వయస్సుకు తగిన ఎత్తు, బరువు ఉండేలా పరిశీలిస్తుండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఉన్న మూడు అంగన్వాడీ కేంద్రాలను, తిరుమలాపురం గ్రామం అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె సందర్శించి పిల్లల పోషణ స్థితిని గమనించారు. పిల్లలతో ముచ్చటించి ఆటపాటల విద్య పరిశీలించారు.అంగన్వాడీల లోని న్యూట్రిషన్ గార్డెన్లను బాగా అభివద్ధి చేయాలని సీడీపీఓలకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కష్ణవేణి, మండల స్పెషల్ ఆఫీసర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాం, ఎంపీడీవోఉమాదేవి, ఎంపీటీసీ నవీన్ కుమార్, సిడిపిఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.