Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు
నవతెలంగాణ -తుంగతుర్తి
కార్మికుల,రైతు,వ్యవసాయ కార్మిక వర్గాల జీవనాధారం పై పాలకులు నిరంతరం దాడిచేస్తున్న నేపథ్యంలో కార్మికులు,కర్షకులు బలమైన సమైక్య పోరాటాలు జరిపి పాలకుల విధానాలను తిప్పికొట్టాలని వ్యవసాయ జిల్లా ప్రధానకార్యదర్శి మట్టిపెళ్లి సైదులు పిలుపునిచ్చారు. బుధశారం మండల కేంద్రంలోని మల్లువెంకట నరసింహారెడ్డి భవన్లో సీఐటీయూ ,రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మిక, కర్షక ఐక్యత కోసం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగించారు. ఈ మేరకు 40 ఏండ్ల క్రితం 1982జనవరి 19న స్వతంత్ర భారత చరిత్రలో చైతన్యవంతమైన, సమరశీల పోరాటం జరిగందన్నారు. పట్టణ,గ్రామీణ కార్మికులు కలిసి ఒకే వేదికపై జరిపిన సాదారణసమ్మెను పాలకులు తీవ్ర నిర్బంధం ప్రయోగించి అణిచివేతకు కుట్రలు చేసి దేశ వ్యాప్తంగా పోలీసుల కాల్పుల్లో పది మంది శ్రమ జీవులు అమరులైనారని అన్నారు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లా సుదర్శన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు గడ్డం ఎల్లయ్య విష్ణుమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు జాజు గళ్ళ ముత్తయ్య , కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవరకొండ యాదగిరితదితరులు పాల్గొన్నారు.