Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ
ఈ నెల 22న నిర్వహించనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర బహిరంగ సభను జయప్రదం చేయాలని మండల కార్యదర్శి సిరిపని స్వామి కోరారు. బుధవారం మండల కేంద్రంలో రాష్ట్ర మహాసభలకు విజయవంతం చేయాలని కోరుతూ విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రెండు ప్రభుత్వాలు పద్ధతులను ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు రామ్ చందర్ మండల కమిటీ సభ్యులు మొగిలి పాక గోపాల్ బుగ్గ చంద్రమౌళి పట్టణ కార్యదర్శి గర్దాస్ నరసింహ నాయకులు జైపాల్ సురేష్ ఏనుగు నరసింహ వేముల జ్యోతి బాబు తదితరులు పాల్గొన్నారు